May 21, 2011

రియాల్టి షో లా లేక సర్కస్ ఫీట్లా ?



           ఈ మద్య అన్ని చానల్స్ లో ను రియాల్టి షో లు ప్రదసిస్తున్నారు.....వాటిని చూస్తుంటే ఎదో సర్కస్ షో ను చూస్తున్నట్టు ఉంది.  గాలిలోకి ఎగరడం, రింగుల మధ్యనుంచి దూకడం.
నిప్పుతో చెలగాటాలు ఆడడం ఇవ్వన్నీ సర్క స్ వాళ్ళు చేసేవి కాదంటారా ? అవి చూస్తున్నంత సేపు ఎదో సర్కస్ లో ఉన్న అనుభూతి కలగడం లేదా ?
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకటి, రెండు సినిమాలకు డాన్స్ కంపోస్ చేసిన వాళ్ళను జడ్జ్ మెంట్ కు పిలవడం. అసలు కొన్ని షో లలో అయితే పోటీ దారుల మధ్య గొడవలు, జడ్జ్ స్ మధ్య గొడవలు పెట్టి దాన్ని పెద్ద విషయం చేసి. దాన్ని పెద్ద పాపులర్ చేసి చూపిస్తున్నారు. అసలు న్యాయనిర్ణేతగా వచ్చినవ్వాళ్ళు తప్పుచేసినా మనం భరించాలి. అలాంటిది వారిని ఎదురించి నేను ఎంతో బాగా చేసానని తిట్టడం మరలా దాన్ని రికార్డ్ చేసి నిమిషానికి ఒక సారి ట్రైలర్స్ లో చూపించడం...

          ఇదిలా ఉంటే కొన్ని చానల్స్ లో అమాయకమైన పిల్లల మధ్యన కూడా తగాదాలు పెడుతున్నారు. అసలు ఆ చిన్న వయస్సులో వారిని అంత కష్టపెట్టడం అవసరం అంటారా ? వారితోనూ చాలెంజ్ లు చేపిస్తున్నారు..
అంత ఎందుకు నేను ఇందాక చెప్పాను కదా సర్కస్ ఫీట్లు అని అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్పడే చిన్న చిన్న అవాంతరాలను సైతం రికార్డ్ చేసి చూపించడంలో మనవాళ్ళు చాలా దిట్టలు..ఒక పక్కన మనిషి చాపుబతుకల మధ్య అల్లాడుతుంటే మానవత్వంగా కాపాడవలసింది పోయి దాన్ని వీడియో తీయడం దాన్ని తిప్పి తిప్పి ప్రసారం చేయడం అవసరమంటారా ?

           కేవలం వాళ్ళ చానల్ ను పాపులర్ చేసుకోవడానికి మత్రమే ఉపయోగపడే ఇలాంటి షో లను ప్రోత్సహించడం అవసరమంటారా ?  కానీ వీటి వల్ల లాభాలు కూడా లేకపోలేదు.. ఎందరో నిరుద్యోగులకు ఇలాంటి షో ల వల్లనే ఉపాధి కలుగుతుంది. ఇది చాలా మంచి విషయమ. కానీ వాళ్ళు తిట్టుకోవడం ఎలాగా అని తెలియని వాల్లకు సైతం తెలియజేసేలా ఉండే ఇలాంటి ప్రసారాలను కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా ఆశ... మీరు ఎస్. ఎమ్. ఎస్ చెయ్యడం వల్ల  లాభం ఎవరికి వస్తుంది అని ఒక్క సారి ఆలోచించండి..........


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...