June 12, 2011

500 అక్షరాల సందేశం పంపేందుకు సైట్



       మమూలుగా Way2SMS  లాంటి సైట్స్ ద్వారా 140 అక్షరాల మెసేజ్ ని మాత్రమే పంపగలం..కానీ  http://www.bollywoodmotion.com/free-long-sms-india.html    అనే సైట్లో భారీగా 500 అక్షరాల మెసేజ్ ను పంపడానికి వీలుంది.....అంతే కాకుండా ఈ సైట్ నుంచి మెసేజ్ చేయడానికి రిజిష్టర్ చేసుకోవలసిన పని గానీ, లాగ్ ఆన్ అవ్వాల్సిన పనికానీ లేదు..
నేరుగా సైట్ ఓపెన్ చేసి సందేశం పంపేయవచ్చు......



ఇలాంటివే ఇంకొన్ని సైట్లు:

1.       SMS Masti:   http://smsti.in/send-free-sms/   అనే సైట్ నుంచి  కూడా ఇండియాలో ఏ నెంబరుకైనా 160 అక్షరాల సందేశం పంపించవచ్చు. దీనిలో కూడా రిజిష్టర్ చేసుకోవలసిన పనిలేదు.

2.       Spice SMS:    భారతదేశం లోపల ఏ నెంబరుకైనా http://spicesms.com/sendsms.php  అనే సైట్ ద్వారా 130 అక్షరాల సందేశం పంపించవచ్చు.

3.       Sea-SMS:  http://seasms.com/#type అనే ఈ సైట్ ద్వారా ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడి కైనా 160 అక్షరాల  సందేశం పంపించవచ్చు....ఇండియా యూజర్ లు  ఇందులో వారి ప్రాంతీయ భాషలోనే సందేశం పంపించవచ్చు....కానీ మీరు పంపే మొబైల్ అందుకు సపోర్ట్ చెయ్యాలి. అంతేకాదు అన్ని సైట్స్ జోడించే send వయా ఫలానా సైట్ అన్న యాడ్ కూడా ఇందులో రాదు...


ఒక్క విషయం:  ఈ సైట్స్ అన్నింటిలో మనం అజ్ఙాత వ్యక్తులుగా సందేశం పంపించవచ్చు కదా అని వీటిని దుర్వినియోగం చేద్దాం అనుకుంటారేమో...మీరు సందేశం పంపే ప్రతి సారీ మీ కంప్యూటర్ యెక్క ఐ.పి అడ్రస్ తదితర వివరాలు ఆయా సైట్స్ లో  రిజిష్టర్ అవుతాయండోయ్..... ఆ వివరాలు మామూలు ప్రజలకు వెల్లడించకపోయినా పోలీసులకు మాత్రం ఆ సైట్ వారు అందిస్తారు.. కాబట్టి టెక్నాలజీని దుర్వినయోగం చెయ్యకుండా మీకు తెలిసిన వారికి మాత్రమే సందేశాలు పంపండి.....


7 comments:

  1. చాలా బాగుంది నాకు నచ్చే విధంగా మీరు వివరించారు.-( శ్రీకర్ )-పరాక్రి కుమారుడు

    ReplyDelete
  2. మీ బ్లాగు లో " నాకు నచ్చిన కొటెషన్లు " స్క్రోలింగ్ ఎలా చేయాలి తెలపగలరు.- శ్రీకర్

    ReplyDelete
    Replies
    1. రాధాకృష్ణగారు అలా స్క్రోలింగ్ రావాలంటే ఈ లింకు ఓపెన్ చేస్తే ఒక కోడ్ వస్తుంది
      http://dl.dropbox.com/u/24426112/Blog%20content/Marquee%20text%20Code.txt
      దానిలోని type your text here అన్న దాన్ని మీ కొటేషన్లతో మార్పుచెయ్యండి...
      తర్వాత మీ బ్లాగు Dash board లో design > Add a Gadget > Html/Java script అనేవి ఎంచుకోని ఈ కోడ్ ను అందులో పేస్టు చెయ్యండి..
      టెక్స్ట్ రంగులు మార్చడానికి ఈ సైట్ వాడడండి... http://html-color-codes.info/

      Delete
  3. కృతఙ్ఞతలు. నా బ్లాగు చూదండి

    ReplyDelete
  4. రాధాకృష్ణగారు మీ బ్లాగు చూశాను... చాలా బాగుంది.. నేను చెప్పినట్లు చేసినందుకు ధన్యవాదాలు....

    ReplyDelete
  5. సాయిగారు నమస్కారములు, మా మూడు బ్లాగులుparakrijaya blogspot.com - parakri blogspot.com - parakri-jaya blogspot.com సైన్ ఇన్ చేయడానికి అవడం లేదు,this blog has been removed అని వస్తోంది,మా గోగుల్+ అకౌంటు 404 ఎర్రర్ చూపిస్తోంది,గోగుల్ సెర్చ్ లో మా బ్లాగు వద్ద cache అని వస్తోంది, దానిని క్లిక్ చేస్తే బ్లాగు చూడబడుతోంది,దయచేసి మా బ్లాగులు తిరిగి తెచ్చుకునే మార్గం తెలపండి

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేసి ఆ బ్లాగులను కొట్టేసారు అని అర్దం అవుతుంది... మీరు మీ గూగుల్ అకౌంట్ కు రికవరీ ఈ మెయిల్ కానీ లేక ఫోన్ నెంబర్ కానీ ఇచ్చి ఉంటే ... లాగాన్ అయ్యేసమయంలో కింద can't able to access my acount అని క్లిక్ చేసి, తరువాత forgot password అని క్లిక్ చేస్తే మీ మెబైల్ కుకానీ లేక రికవరీ మెయిల్ అడ్రస్ కు కానీ లింకు పంపబడుతుంది.. అది కుదరకపోతే గూగుల్ వారికి మెయిల్ పెట్టవలసి ఉంటుంది... ఒక సారి మీ అకౌంట్ మీ చేతికి వస్తే డిలీట్ అయిన బ్లాగులు తిరిగి తెచ్చుకోవడం సాధ్యమే.... ముందు గూగుల్ అకౌంటును రికవరీ చేసుకోండి..

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...