June 12, 2011

అన్నమాచార్య సంకీర్తనలు---చిన్ని శిశువు

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన చిన్ని శిశువు అనే సంకీర్తనను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ను క్రింద ఉన్న వీడియోలో వింటూ చదువుకోవచ్చు......
 


చిన్ని శిశువు చిన్ని శిశువు
ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు॥

తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత
కాయలవంటి జడలా గములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పాయక  యశోద వెంట పారాడు శిశువు॥

ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగరాల
నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ
అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు॥

బలుపైన పొట్ట మీది పాల చారలతోడ
నులివేడి వెన్నతిన్న నోరితోడ
చలగి నేడిదే వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు॥


8 comments:

  1. video with lyrics chala bagutndandi.
    inka ilanti videos unnaya midaggara ?

    ReplyDelete
  2. శ్రావణ్ కుమార్ గారు...బాగుంది అని చెప్పినందుకు ధన్యవాదాలు.. నేను ప్రస్తుతానికి కొన్ని వీడియోలను మాత్రమే ఇలా తయారు చేసాను.. వాటిని మీరు http://www.youtube.com/gvsbks అనే చానల్ లో చూడవచ్చు...

    ReplyDelete
  3. thanks andi , i subscribed to your channel.
    btw, please have a look at my blog :
    http://annamacharya-lyrics.blogspot.com/

    ReplyDelete
  4. శ్రావణ్ గారు మీ ఐదు బ్లాగులూ చూశాను..ఎంతో బాగున్నాయి..మీ బ్లాగులలో మూడింటిని ఎప్పటి నుంచో విజిట్ చేస్తూ ఉన్నాను కూడా.... మీరు చేస్తున్న దాని ముందు నేను ఎంత అండి...ధ్యాంక్యూ వెరీమచ్ అండి...

    ReplyDelete
  5. శ్రీ గారు, మీ బ్లాగు చాల బాగుంది. నాకు అన్నమాచార్య కీర్తనలంటే ప్రాణం. మీరు తయారుచేసే యూట్యూబ్ విడియోలు చాల అర్ధవంతంగా ఉన్నాయి. ఈ చిన్ని శిశువు కీర్తనలో కొద్ది అచ్చుతప్పులు దొర్లాయి. అవి...మొదటి చరణం, ఆఖరి పంక్తి లో "పయక" బదులు "పాయక " అని వుండాలి. రెండవ చరణం, మొదటి పంక్తి: "యుంగగాల" బదులు "యుంగరాల" అని వుండాలి. మంచి కీర్తనలు అందిస్తున్నందుకు మరొక సారి ధన్యవాదాలు.

    ReplyDelete
  6. సూర్యనారాయణ గారు మీరు చెప్పింది నిజమే. ఆ తప్పులను సరిచేసాను. నా తొందరపాటు తనం వల్ల ఇలా జరిగినందుకు క్షమించగలరు... ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాను.. ధ్యాంక్యూ వెరీమచ్ అండి..

    ReplyDelete
  7. సాయి గారూ!
    చాలా మంచిపని చేస్తున్నారు..మీరన్నట్టు శ్రవణ్ బ్లాగు లో బోలెడన్ని సంకీర్తనలు..ఏదో చిన్ని ప్రయత్నం నా తరఫు నుండి కూడా..దర్శించి విమర్శించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండి..
    balantrapuvarublog.blogspot.in

    ReplyDelete
    Replies
    1. BEE VEE ESS AAR KE గారూ.. నేను మీ బ్లాగును ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాను అండీ,,,,
      ధ్యాంక్యూ...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...