June 18, 2011

అన్నమాచార్య సంకీర్తనలు---విష్ణు దేవు పాదములే విద్యాబుధ్ధీ మాకు




విష్ణు దేవు పాదములే విద్యాబుధ్ధీ మాకు
వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా ||


గోవిందునిపాదములే కోరి యిహపరములు
శ్రీవిభునిపాదములే చేరువేదశాస్త్రములు
దేవదేవుపాదములే దిక్కును దెసయు మాకు
భావములో నిలిపితి పాయరో పాపములు ||

హరిపాదములే మాకు అన్నపానభోగములు
పరమాత్ము పాదములే పాడీ పంటా మాకు
మురహరు పాదములే ముందరా వెనక మాకు
శరణంటి మెందైనా చనరో దుఃఖములు||

అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు
దనుజారి పాదములే ధనధాన్య ధర్మములు
యెనలేని శ్రీవేంకటేశు డితనిపాదాలే
మనసున కొలిచితి మానరో భవములు
||

ఈ సంకీర్తనను ఇక్కడ వినవచ్చు.


శ్రీ వారి పాదాలు







తెలుగు భాషాపరిరక్షణ
See this link for details:http://computerera.co.in/blog/?p=2617

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...