June 26, 2011

అన్నమాచార్య సంకీర్తనలు---వీడివో అల విజయరాఘవుడు





వీడివో అల విజయరాఘవుడు
పోడిమి కొలువున పొదలి చెలియ ||

 రాముడు లోకాభిరాముడు గుణ
ధాముడసురులకు దమనుడు
 తామర కన్నుల దశరధ తనయుడు
మోమున నవ్వి మొక్కవే చెలియ ||

కోదండధరుడు గురుకిరీటపతి
 కోదిగసురముని పూజితుడు
అదిమపురుషుడు అంబుదవర్ణుడు
 నీ దెసచుపులు నించే చెలియ  ||

 రావణాoతకుడు రాజశేఖరుడు
 శ్రీవేంకటగిరి సీతాపతి
వావిలి పాటిలో వరమూర్తి తానై
వోవరి కొలువున ఉన్నాడే చెలియ ||



ఈ సంకీర్తనను ఇక్కడ వినవచ్చు.






No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...