June 30, 2011

తెలియని లింకులపై క్లిక్ చేసేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు



      మనం మెయిల్స్ లోనూ ఆర్కుట్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ అనేక తెలియని లింకు లపై క్లిక్ చేస్తూ ఉంటాం.. మనకు ఎంతో తెలిసిన వారి నుంచి వచ్చినవే అయినా కొన్ని స్పైవేర్లను కలిగి ఉంటాయి..చాలా మంది వీటి బారిన పడే ఉంటారు. వాటిపై క్లిక్ చేసే ముందు మనం చెయ్యవలసిన దాని గురించి ఇప్పుడు చూద్దాం..


దీనికోసం నా ఆర్కుట్ కు వచ్చిన ఒక స్క్రాప్ తీసుకుంటున్నాను..

దీనిలో మన గూగుల్ పాస్ వర్డును దొంగిలించే ఒక డేంజరస్ లింకు ఉంది (పొరపాటున కూడా లింకును ట్రై చెయ్యద్దు)
1.       మెదట ఆ లింకును రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అని ప్రెస్ చేసి లింకును కాపీ చేసుకోండి
2.       దాదాపు అన్ని వైరస్ లింకులు ఆంటీవైరస్ ప్రోగ్రాములతో గుర్తించబడకుండా ఉండేందుకు పొట్టి లింకులుగా మార్చబడు ఉంటాయి. (tinyurl, mcaf.ee google url shorten వంటి సర్వీసులను ఉపయోగిస్తారు)
3.       కాబట్టి వీటి నిజమైన లింకులను పొందేందుకు ఆ లింకును http://urlxray.com/ అనే సైట్లో ఎంటర్ చేసి X-Ray అని ప్రెస్ చెయ్యండి.

4.       అప్పుడు అది చూపించిన అసలు లింకును కాపీ చేసుకోండి.
5.       ఆ లింకు సురక్షితమైనదా కాదా అని తెలుసుకొనేందుకు దాన్ని http://www.urlvoid.com/ లోని సెర్చ్ బాక్సులో వేసి scan అని ప్రెస్ చేస్తే ఆ లింకు సురక్షితమా కాదా అని ఇలా రిపోర్టు వస్తుంది..


కాబట్టి సరక్షితమైన లింకులనే క్లిక్ చేసి సేఫ్ గా ఉండండి..


2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...