June 13, 2011

అన్నమాచార్య సంకీర్తనలు---ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు

           ఏదైనా సరే ఆ హరి మనకు ప్రసాదించిన జన్మమే చాలు అంటూ అన్నమాచార్యుల వారు వివరించిన పాట ఇది.... శునకమునకు దాని జన్మ తక్కువగా అనిపించదు మనకు మాత్రమే అది నీచమైన జన్మ అని అనిపిస్తుంది. ఆ కుక్క మాత్రం తాను మహారాజు భోగాలు అనుభవిస్తున్నట్టుగా తలుస్తుంది... మనసు పడి ఉంటే ఎక్కువ లేదు తక్కువ లేదు....

          అలాగే పురుగుకు అది నివసించే పెరటిలోని గుంత భువనేశ్వరంలా తోస్తుంది... అలాగే ఆ వేంకటేశ్వరున్ని నమ్మి కొలిచే వారికి లోకమంతా విష్ణుమయం లాగానే కనపడుతుంది అని అన్నమాచార్యుల వారు ఎంతో చక్కగా వ్రాసిన ఈ పాటను క్రింద వీడియోలో వింటూ, అర్దం చేసుకుంటూ చదువుకోండి.....





ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు
ఆదినారాయణుడీ అఖిల రక్షకుండు ||
 

శునకము బతుకును సుఖమయ్యే తోచుకాని
తనకది హీనమని తలచుకోదు |
మనసొడబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో అంతరాత్మ దైవమగుట తప్పదు ||
 

పుఱువుకుండే నెలవు భువనేశ్వరమైతోచు
పెరచోటి గుంటయైన ప్రియమైయుండు |
ఇరవై వుండితే చాలు ఎగువేమి దిగువేమి
వరుస లోకములు సర్వం విష్ణుమయము ||



అచ్చమైన ఙ్ఞానికి అంతా వైకుంఠమే
చెచ్చర తనతిమ్మటే జీవన్ముక్తి |
కచ్చుపెట్టి శ్రీవేంకటపతికీ దాసుడైతే
హెచ్చుకుందేమిలేదు ఏలినవాడితడే ||



No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...