December 2, 2011

“సత్యం” కు గల గొప్పతనం


  

   పస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అయినదానికి, కానిదానికి, అసలు అబద్దం ఆడవల్సిన అవసరంలేని సందర్భాలలో సైతం  అబద్దాలు ఆడడం గమనించవచ్చు... అసలు సత్యానికి ఉన్న గొప్పతనం ఇక్కడ తెలుసుకోండి.



సత్యమంటే నిజం. సత్యముకు మించిన ధర్మము లేదు. వేదకాలం నుండి సత్యమునకు విశిష్ట స్ధానం ఉంది. సత్యం పలికితే పుణ్యం లభిస్తుంది, అబద్దం ఆడితే పాపం వస్తుంది.  ధర్మం, సత్యం, అహింస మెదలైన సద్ధర్మాల మీదనే సకల చరాచర సృష్టిమయమైన లోకం ఆధారపడి ఉంది.
ఆదికవి అయిన నన్నయ్య సత్యం గురించి ఇలా అన్నాడు..

  నూరు బావుల కంటే ఒక దిగుడు బావి మేలు, నూరు దిగుడు బావులకంటే ఒక యజ్ఞం మేలు, నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు, నూరుమంది పుత్రులకంటే ఒక సత్యవాక్యం మేలు 
వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఫలం కన్నా, సత్యం వాక్యానికి ఉన్న ఫలం ఎక్కువ. అన్ని ధర్మాలకంటే సత్యము గొప్పదని అంటారు.
గురుకులాలో సత్యబోధన

మహాకవి కాళిదాసు కూడా 
  సత్యాయ మిత భాషిణే   
 అని సత్యాన్ని ఎలా సాధించవచ్చో తెలిపాడు. హరిశ్చరిందుడు, గాంధీజీ మెదలైన ఎందరో సత్యాన్ని ఆచరించి  మహాత్ములై పకాశించినారు. 

లోకం సత్యవంతులని ఎంత గౌరవిస్తుందో, అబద్దాలు ఆడేవారిని అంత హీనంగా చూస్తుంది. న్యాయస్ధానాలలో సైతం భగవద్గీతపై ప్రమాణం చేయించడంలో సత్యానికున్న గొప్పతనం గోచరిస్తుంది.   అబద్దాలు ఆడేవారికి ఆడపిల్లలు పుడతారు అని హేళన చెయ్యడం వెనక సత్యప్రాశస్త్యం గోచరిస్తుంది.
అన్ని మతాలు సత్యం గురించి ఉన్నతంగా చెప్తాయి.  మన గురుకులాలో సైతం సత్యం వద ధర్మం చర   అని అనేక సార్లు వల్లె వేయిస్తారు. 

సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయత్, నబ్రూయాత్ సత్యమప్రియం.   
 అంటే సత్యాన్ని అప్రియంగా పలకరాదని, కొన్ని సందర్భాలలో అబద్దాలు ఆడవచ్చునని పెద్దల అభిప్రాయం. దీనికి ఉదాహరణగా...

వామన అవతారంలో బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు చెప్పిన  నీతిని మనం గమనించవలసి ఉంటుంది. 
 

“ వారిజాక్షులందు వైవాహికము లందు
బ్రాణవిత్త మానభంగమందు
జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొందదధిప ”
 
     అంటే శత్రువుల వద్ద, వివాహ సమయాలలో, ప్రాణం, గౌరవం పోయే దగ్గర, వంశమే నాశనం అవుతున్నప్పుడు, అలాంటి సందర్భాలలో అబద్దం ఆడవచ్చు.......

బల్యం నుండి అలవడవలసిన సద్గుణాలలో సత్యం ఒకటి. సత్యగుణ సంపన్నుడు నిర్భయిడై, విజేతయై, తేజశ్వియై పకాశింపగలడు.........

 

1 comment:

  1. సత్యనారాయణDecember 3, 2011 at 7:24 AM

    చాలా బాగుంది...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...