December 23, 2011

నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు బయటపడుతుంది ?



     ప్రేమలో కపట ప్రేమ, నిజమైన ప్రేమ అని రెండు రకాలు ఉంటాయి... కపట ప్రేమ అనేది మనపై ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది... అలాంటి కపటప్రేమ కలిగినవారు ఎలా ఉంటారంటే .. మీరు ఏం చేస్తున్నా అందులో అవసరం లేకపోయినా ఏదో ప్రయోజనం కోసం సాయం చేస్తూ ఉంటారు.... కానీ మనపై నిజమైన ప్రేమ ఉన్నవారు మనం కష్టంలో ఉన్నప్పుడు మీరు అడకుండానే సాయం చేస్తారు, అవసరమైతే ప్రాణం అయినా ఇస్తారు.... అలాంటి నిజమైన ప్రేమ కలిగినవారు మీ చుట్టూ వుంటూ మిమ్మల్ని తిడుతూనే ఉండచ్చు... కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే వారిలోని నిజమైన ప్రేమ బయటపడుతుంది.....

ఉదా: మీ తోబుట్టువులో,  బంధువులో, స్నేహితులో  మిమ్మల్ని ఎప్పుడూ  తిడుతూ, మీపై ప్రేమ లేనట్టే ప్రవర్తిస్తుంటారు.. కానీ వారిలోని నిజమైన ఆ ప్రేమ మీరు ఆపదలో ఉన్నప్పుడు కచ్చితంగా బయటపడుతుంది....కాదంటారా?

కానీ అలాంటి వారే మీరు కష్టంలో ఉన్నప్పుడు, లేదా మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు  చోద్యం చూస్తున్నట్టు చూస్తుంటే  మీకు బాధగా ఉండదా ?

ఈ రోజు నాకు అలాంటి పరిస్దితే ఎదురైంది..... ఎవరో ఏదో అనుకుంటారని మనవారిని, పరాయివారిలా చూడడం భావ్యమేనా .................?

2 comments:

  1. సాయి గారు మీరు చెప్పింది నిజమేనండీ
    ప్రేమలొ కపట ప్రేమ,నిజమైన ప్రేమ రెండూ వుంటాయి ఇది వాస్తవమే.

    నిజమైన ప్రేమ అనేది కష్టాల్లో,ఆపదలో వున్నప్పుడే బయటపడుతుంది..

    ReplyDelete
  2. నిజమే...రాజీ గారు..ధ్యాంక్యూ... నేను అలాంటి వాళ్ళ మధ్యనే ఉంటున్నాకాబట్టి నాకు అనిపించింది రాసాను.....

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...