January 17, 2012

వలపుల సొలపుల వసంత వేళ ఇది --అన్నమాచార్య సంకీర్తనలు



వలపుల సొలపుల వసంత వేళ ఇది
సెలవి నవ్వకువే, చెమరించీ మేను ||

శిరసు వంచకువే సిగ్గులు వడకువే
పరగ నిన్నతడూ తప్పక జూచేని |
విరులు దులుపకువే వెసఁ దప్పించుకోకువే
సిరులనీ విభుడిట్టే సేసవేట్టీనీ || 



చెయ్యెత్తి యోడ్డుకొకువే చేరి యాన పెట్టకువే
చాయల నాతడు నీ చన్నులంటీని |
ఆయములు దాచకువే అట్టే వెరగందకువే
మోయనాడి సరసము మోహన నీ విభుడు ||


పెనగులాడకువే బిగువు చూపకువే
ఘన శ్రీ వేంకటేశుడు కౌగిలించీని |
అనుమానించకువే అలమేలు మంగవు నీవు
చనవిచ్చి నిన్ను నేలే సమ్మతించీ ఆతడు ||


స్పీకర్లు ఆన్ చేసుకోండి..





Download Link


5 comments:

  1. చాలా బాగుందండీ. ఇంతకు ముందు వినలేదీ కీర్తన.

    ReplyDelete
    Replies
    1. ఇది చాలా పాత సంకీర్తనే అండి.. కానీ ఒక్క అన్నమయ్య వైభవం బ్లాగులో తప్పితే ఇంకెక్కడా లేదు.. ఎందుకో తెలీదు.. కానీ అక్కడ కూడా ఆడియో ఇవ్వలేదు.. ధ్యాంక్యూ..

      మీ పిట్టకధలు బ్లాగు చాలా బాగుంటుంది...భలే రాస్తారండీ మీరు కధలు.. సూపర్...

      Delete
  2. ఈ కీర్తనకి download link ఇవ్వరూ కొంచెం?

    ReplyDelete
    Replies
    1. నాగేస్రావ్ గారు లింకు ను పోస్టులోనే ఏర్పాటు చేసాను... దానిపై రైట్ క్లిక్ చేసి save link as అనే ఆప్షన్ ఎంచుకోండి...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...