January 12, 2012

వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ



వచ్చెను అలమేలుమంగ      పచ్చల కడియాల పణతి చెలంగ ||



బంగారు చేదివిటీలు పూని  శృంగారవతులు వేవేలురాగా |

రంగైన వింజారమరలు వీవ  మాంగల్యలీల సొంపగు జవరాలు ||          -|వచ్చెను|


పలుకుల తేనియ లొలుక చెంత   చిలుకలు కలకల పలుక  |

రవల గిలుకు పావలు ముద్దుగులుక మేటి   కలికి చూపుల మొనలు తళుకని చిలుక  ||      -|వచ్చెను|


రంభాది సతులెల్ల చేరి యెదుట గంభీర గతులను మీర  |

నటనా  రంభములను మేలుకోరి కొలువ అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి  ||    -|వచ్చెను|



మీ స్పీకర్లు ఆన్ చేసుకుంటే ఈ సంకీర్తన వినవచ్చు...


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...