February 20, 2012

ఇహపరములకును ఏలికవు --అన్నమాచార్య సంకీర్తనలు

రేకు: 1883                                                      
Vol: 22
రాగం: శంకరాభరణం

Download  (G Bala Krishna Prasad)



      ఇహపరములకును ఏలికవు 
      బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||


||   వేయికరంబుల వివిధాయుధంబుల
      దాయల నడచిన దైవమవు |
      నీయందున్నవి నిఖిల జగంబులు
       పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||


|| కదిమి దుష్టులను గతము చేసితివి 
      త్రిదశుల గాచిన దేవుడవు |
      వదల కిందరికి వరములొసంగగ 
      బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||


|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు 
      కావలసినచో కలుగుదువు |
      శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన 
     భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||



2 comments:

  1. అన్నమాచార్యుల సంకీర్తనలను మన అందరికీ అందిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు...నాకు అంతర్జాలంలో కనపడని పాటలను ఆడియోతో సహా అందించాలన్న నా చిన్ని ప్రయత్నం......

    ReplyDelete
  2. ఏదైనా అక్షరదోషాలు ఉంటే క్షమించి తెలియజేయగలరు...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...