February 22, 2012

సగము మానిసిరూపు సగము మెగపురూపు -- అన్నమాచార్య సంకీర్తనలు

రాగం: నాట
శృంగార కీర్తనలు
Volume-18
Page No-140
సంకీర్తన -209


Download (G Balakrishna Prasad)




సగము మానిసిరూపు సగము మెగపురూపు
అగణిత ప్రతాపపు అహోబళేశుడు ||

గద్దెమీద కూచున్నాడు కంబములో పుట్టినాడు
కొద్దిమీర కడు నవ్వుకొంటానున్నాడు  |
వొద్దనె శ్రీసతి చన్ను లొరయిచున్నవాడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుడు ||

పెను మీసాలవాడు పెదపెద గోళ్ళవాడు
ఘనునిగా ప్రహ్లాదుని కాచుకున్నాడు |
మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాడు
అనుప తేజుడమ్మ అహోబలేశుడు ||

వేవేల చేతులవాడు వెన్నెల ఛాయలవాడు
భావించి కొల్చినవారి పాలిటివాడు |
శ్రీ వేంకటగిరి మీద చేరి భవనాశిదండ
ఆవల నీవల మించె అహోబలేశుడు ||



గమనిక:  నాకు Internet లో లిరిక్స్,ఆడియో కనపడని అన్నమయ్య  సంకీర్తనలను అందించాలని చిన్ని ప్రయత్నం... వీటిని నేనే టైప్ చేసాను కనుక అక్షరదోషాలు ఉంటే క్షమించి తెలియజేయగలరు...

2 comments:

  1. bhavanaaSi annadi padam naayanaa !! sarichEsukOgalavu.[aakhari charaNam lOnidi.]

    ReplyDelete
    Replies
    1. జయప్రభ గారు.. ధ్యాంక్యూ వెరీమచ్... తప్పుని చెప్పినందుకు... మార్చాను.ఇప్పుడు ఒకేనా ?

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...