February 24, 2012

ఈ తప్పును ఇలాగే నేర్చుకోవద్దు...





           నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం 
   పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |  
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం 
         నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||



    ఇది ఉమా మహేశ్వర అష్టకంలోని మెదటిది.... దీనిలోని మూడవ లైన్ లో నగేంద్రకన్యా అని ఉంది కదా... దాన్ని కొందరు సుప్రసిద్దగాయకులు నాగేంద్రకన్య అని పాడడటం చూసి ఆశ్చర్యపోయాను..

నాకున్న మిడి మిడి జ్ఞానం ప్రకారం

నగము = గిరి, పర్వతము

 అమ్మవారిని పర్వతరాజపుత్రిక కనుక పార్వతి అని, హిమవంతుని కుమార్తె కనుక  హైమవతి అని  , గిరి కన్యకగా గిరిజ అని అనేక విధాల పేర్లతో పిలుస్తారు..

నగేంద్రకన్య అనగా గిరిరాజ పుత్రిక (గిరికన్య) ..... అని అర్దం..
కానీ నాగేంద్ర కన్య అంటే  నాగకన్య  అని అర్దం వస్తుంది.. అది నిజం కాదు కదా?

ఆ పాటను ఇక్కడ ఉంచితే నా అభిమాన గాయకులను నేను అవమానించినట్లు అవ్వచ్చు.... అది నా అభిమతం ఎంతమాత్రం కాదు...

నేను ఈ పోస్టు రాయడానికి కారణం అది కాదు.... అది విని అలాగే నేర్చుకొనే వాళ్ళు కొంచెం తెలుసుకుంటారని...

గమనిక: నాకున్న మిడిమిడి జ్ఞానంతో ఈ పోస్టు రాసాను..... ఏదైనా తప్పుగా రాసి ఉంటే దయచేసి క్షమించగలరు...

5 comments:

  1. చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పింది చాలా సత్యం. అవునంటాను.

    ReplyDelete
    Replies
    1. Dr.రామక పాండు రంగ శర్మ గారు.. ధ్యాంక్యూ

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. సరిగా చెప్పారు. గాయకులు మంచి సాహిత్యవేత్తలు కావాలని లేదు కదా. అందు చేత వారు తమకు పాడమని ఇచ్చిన ప్రతి లోని పాఠాన్ని యథాతథంగా పాడేస్తారు. ఒక్కొకసారి ప్రమాదవశాత్తు రచయితలే చిన్నచిన్న తప్పులు పరాకున చేస్తూ ఉంటారు. ప్రమాదో ధీమతా మపి అన్నారు. ఒకవేళ గాయకులకు అనుమానం వచ్చినా తప్పేమోనని, లబ్ధపప్రతిష్టులయిన కవులను ప్రశ్నించటం ఉచితం కాదని అలాగే పాడేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పుడు పాఠాలు ప్ర్రచారంలోకి వచ్చేస్తాయి. గాయకులకు అనుమానం రాకపోవచ్చును కూడా.

    ReplyDelete
    Replies
    1. శ్యామలారావు గారు.. మీరు చెప్పిందీ నిజమే.....సార్
      ధ్యాంక్యూ...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...