March 6, 2012

అన్నింటికీ అబద్దమేనా ?


ఈ లోకంలో ఏ పని జరగాలన్నా, ఆఖరికి స్నేహం కావాలన్నా.. అబద్దమే శరణ్యమా ?....  అదే కరెక్ట్ అయితే అలాంటి స్నేహం నాకొద్దు....

స్నేహం పెరగాలన్నా అబద్దమే మార్గం అనుకుంటా... మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది మాత్రం నిజం... 
ఉదా: మీ స్నేహితుడు నేను ఎలా ఉన్నాను..బాగున్నానా ? అని అడిగితే, "చీ నువ్వేం బాగున్నావురా? ఏడ్చినట్టు ఉన్నావు  రా...." అని నిజం చెప్తే  దాదాపు ఎవ్వరూ స్నేహం చెయ్యరు మీతో.. ( ఏదో కొందరు వీడు నిజం చెప్పాడు..ఇలాంటి వాడే నాకు ఫ్రెండ్ గా కావాలి అనుకొనే వారు తప్పితే )

ఇలా చిన్న విషయం దగ్గరనుండి పెద్దవిషయం దాకా ప్రతి ఒక్కదానికి అబద్దం చెప్పడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది... ఈ లోకంలో ఒక మనిషి మనకు దగ్గర అవ్వాలి అంటే  అబద్దాలు ఆడడం ఒక్కటే మార్గం అంటే మటుకు అలాంటి స్నేహాన్ని వదులుకోవడమే బెటర్ అని నా అభిప్రాయం.....

ఎవరితో నైనా మాటలు పెంచాలి అంటే అబద్దం.. మాటలు తుంచాలి అంటే అబద్దం.. 

అబద్దం మాట్లాడ కూడదా? అంటే మాట్లాడచ్చు.. దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది..  దాన్ని “సత్యం” కు గల గొప్పతనం అనే  నా పాత పోస్టులో  చూడగలరు...

కానీ ఒక్క విషయం ఇప్పుడు ఈ అబద్దం వల్ల కొందరి స్నేహితులు దగ్గర అయి ఉండచ్చు.. కానీ మీరు చెప్పిన అబద్దం ఏదో ఒకరోజు బయటపడినప్పుడు , ఆ స్నేహం దూరమై.. నేను అప్పుడు అలా ఎందుకు అబద్దం ఆడానా అని బాధపడి ఏ ప్రయోజనం ఉండదు......


గుండెల్లో మనపై చెప్పలేంత కసి, క్రోధం పెంచుకొని పైకి మాత్రం పెదాలపై నవ్వులు చిలకరిస్తూ..... అదనుకోసం చూస్తూ, అవకాశం వచ్చినప్పుడు తమ కసినంతా ఒక్కసారిగా వెళ్ళగక్కే వారు నిజమైన స్నేహితులేనా?....



5 comments:

  1. ప్రస్తుతం నేనున్న మానసిక సంఘర్షణలో ఇలా అనిపించింది రాసాను.. తప్పయితే క్షమించండి....

    ReplyDelete
  2. స్నేహం గురించి మీ ఆవేదన అర్థమయింది.మంచి స్నేహాలు కనుమరుగవుతున్నాయి.అందుకే స్నేహం ఫై కొన్ని వ్యాసాలూ వ్రాస్తున్నాను నా బ్లాగు లో చదివి స్పందించగలరు.
    www.ravisekharo.blogspot.in

    ReplyDelete
  3. nenu kuda sai.. meelage konchem depress ai.. finally back to normal..

    ReplyDelete
    Replies
    1. నేస్తం గారు.. రవిశేఖర్ గారు, గిరీష్ గారు ధన్యవాదాలు...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...