March 4, 2012

Computer ను SafeMode లో ఎలా ఓపెన్ చెయ్యాలి


కంప్యూటర్ లో ఏదైనా Device Drivers కానీ, కొన్ని రకాల Software's కానీ install చేసినప్పుడు.. వాటిలో కొన్ని windows లోని ఏదైనా ముఖ్యమైన ఫైల్స్ ను మార్చడం వల్ల, లేదా ఆ Device Drivers సరిగా install అవ్వకపోయినా Windows లోడ్ కాదు...

అంటే ఆ ఫైల్స్ లోడ్ అవ్వక కంప్యూటర్ కొన్నిసార్లు బూట్ కూడా అవ్వలేదు..నిలిచిపోతుంది.. అలాంటి సందర్భాలలో కంప్యూటర్ లో కావల్సిన Drivers మాత్రమే లోడ్ చేసి ఇంతకు ముందు మనం చేసిన మార్పులను సరిచెయ్యడానికి అవకాశం కల్పించేది SafeMode అనేది....

ఒక్కమాటలో చెప్పాలంటే కంప్యూటర్ క్రిటికల్ ప్రాబ్లంస్ కు గురైనప్పుడు దాన్ని Troubleshoot చెయ్యడానికి వీలుకల్పించేదే safeMode అన్నమాట.

ఇలా సేఫ్‍మోడ్ లో ఓపెన్ చెయ్యడమ్ చాలా మందికి తెలిసే ఉంటుంది.. కానీ తెలియని వాళ్ళకోసం ఈ పోస్టు..


1. కంప్యూటర్ ను రీస్టార్ట్ చెయ్యండి.
2. వెంటనే మీ కీ బోర్డుమీద ఉన్న F8 కీ ని ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా ఒక స్రీన్ చూపిస్తుంది.





3. దానిలో SafeMode అనే ఆప్షన్ select చెయ్యండి. (కీబోర్డు మీద ఉన్న arrow keys ఉపయోగించాలి)

అప్పుడు కంప్యూటర్ సేఫ్ మోడ్ లో ఓపెన్ అవుతుంది.


సో ..మీరు ఏదైనా software install చెయ్యడం వల్ల ఇలాంటి పరిస్డితి వచ్చి ఉంటే add/remove programs లోకి వెల్లి ఆ ప్రోగ్రామ్స్ uninstall చేస్తే సరిపోతుంది..
ఇంకా దీనిద్వారా ఇంకా ఏం చెయ్యచ్చో తరువాత పోస్టులలో రాస్తాను.....


మీకు తెలుసా ఈ మోడ్ లో ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి.
1. autoexec.bat , config.sys అనే పైల్స్ లోడ్ కావు...
2. అన్ని Device drivers లోడ్ కావు..
3. నార్మల్ గ్రాఫిక్స్ మోడ్ కాకుండా ఇది VGA graphics mode అనేదాన్ని ఉపయోగిస్తుంది.
4. system.ini అనే పైల్ బదులుగా system.cb అనే పైల్ లోడ్ అవుతుంది. అది Virtual Device Drivers (VxDs) అనే దాన్ని లోడ్ చేస్తుందన్నమాట. ఈ పైల్ కంప్యూటర్ standard parts తో మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది.
5. ఈ మోడ్ లో 16 రంగులు 640 x 480 resolution మాత్రమే లభిస్తుంది... నాలుగు మూలలా safemode అని రాసి ఉంటుంది.

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...