May 12, 2012

ఇక నా ఉనికేది చెలి


నా చెలి......
నువు నిదురవైతే, నేను ఓ కల
నువ్వు సంగీతం అయితే నేను  రాగం
నువ్వు నిప్పు అయితే నేను సెగ
నువ్వు మెరుపు అయితే నేను ఉరుము
నువ్వు ఉష్ణం అయితే నేను ఆవిరి
నువ్వు జనని అయితే నేను శిశువును
నువ్వు వాన అయితే నేను చినుకును
నువ్వు పాటవైతే నేను పల్లవి
నువ్వు ఆయువు అయితే నేను ఊపిరి
నువ్వు వెలుగువు అయితే నేను నీడనై ఎల్లవేళలా నీ వెన్నంటే ఉంటా.....
అదే నువ్వే చీకటైతే..... ఇక నేనెక్కడ ?


5 comments:

  1. మీ చెలి కి అన్నిటా తొడు గా ఉన్న మీరు, మీ చెలి చీకటయితే ఆ "చీకటి" ని అల్లుకున్న "నిశ్శబ్దం "మీరు....మీ ఉనికి మీ చెలి తో నే ఉన్నట్టుంది...
    చాలా బాగుందండీ...!!

    ReplyDelete
  2. ధ్యాంక్యూ సీతగారు....

    ReplyDelete
  3. Sir, కవిత బాగుంది .

    ReplyDelete
  4. ధ్యాంక్యూ ఫాతిమ గారు......

    ReplyDelete
  5. ఆమె చీకటైతే మీరు ప్రేమ వెలుగౌతారు. .బాగుంది మీ వర్ణన.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...